టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసి బస్సు | bus tyre blowouts | Sakshi
Sakshi News home page

టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసి బస్సు

Mar 10 2015 5:35 PM | Updated on Apr 3 2019 4:43 PM

టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన ఆర్టీసి బస్సు పక్కన పొలాల్లోకి దూసుకెళ్ళిన సంఘటన మంగళవారం ఉదయం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చోటుచేసుకుంది

నల్లగొండ :ఆర్టీసి బస్సు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి పక్కన పొలాల్లోకి దూసుకెళ్ళిన సంఘటన మంగళవారం ఉదయం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చోటుచేసుకుంది. గుంటూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపుగా వెళుతుంది. మండలంలోని బుగ్గబావిగూడెం సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు రాగానే బస్సు ముందు కుడివైపు టైరు పేలిపోయింది. దీంతో వెంటనే బస్సు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్ళింది.


అయితే ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌తో సహా 20మంది ప్రయాణీకులు ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement