పీఎఫ్‌ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోండి  | BJP Forcing For Government To Pay RTC Provident Funds In Telangana | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోండి 

Nov 23 2019 4:52 AM | Updated on Nov 23 2019 4:55 AM

BJP Forcing For Government To Pay RTC Provident Funds In Telangana  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు పీఎఫ్‌ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ను రాష్ట్ర బీజేపీ కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు రూ.

760 కోట్ల మేర పీఎఫ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులు గత నెలన్నర రోజులుగా సమ్మె చేస్తున్నారని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 2019 ఏడాదికిగానూ కార్మికులకు రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించాలని ఈపీఎఫ్‌వో డిమాండ్‌ నోటీసులు ఇచ్చిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రికి బీజేపీ ఎంపీలు వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement