మీ ఇంట్లో బిడ్డలా ఉంటా.. | BJP Candidate Sankineni Venkateshwar Rao Canvass In Suryapet | Sakshi
Sakshi News home page

మీ ఇంట్లో బిడ్డలా ఉంటా..

Nov 20 2018 1:24 PM | Updated on Nov 20 2018 1:25 PM

BJP Candidate Sankineni Venkateshwar Rao Canvass In Suryapet - Sakshi

సూర్యాపేట రూరల్‌ : బీజేపీలోకి ఆహ్వానిస్తున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు

సాక్షి, సూర్యాపేట అర్బన్‌ : మీ ఇంట్లో బిడ్డగా ఉంటూ సేవ చేస్తానని.. తనను సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపించాలని బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్‌రావు కోరారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అంతకుముందు సంకినేని నామినేషన్‌ పత్రాలతో సూర్యాపేటలోని శ్రీవేంకటేశ్వర, సాయిబాబా దేవాలయాల్లో పూజలు చేశారు. ఉదయం పది గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేట నియోజక వర్గ ప్రజలు ఒకసారి అవకాశం కల్పిస్తే పేటను  అభివృద్ధిపథంలో నడిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి, నాయకులు రుక్మారావు, జుట్టుకొండ సత్యనారాయణ, నల్లగుంట్ల అయోధ్య, కట్కూరి గన్నారెడ్డి, కొణతం అప్పిరెడ్డి, హబిద్, తుక్కాని మన్మధరెడ్డి, జటంగి వెకంటేశ్యర్లు, శ్రీరాములు, సంపత్‌కుమార్,బూర మల్సూర్‌గౌడ్, వల్దాసు ఉపేందర్, రాజేష్‌నాయక్, మమతారెడ్డి, రంగినేని ఉమ, నాగమణి, శారద, పోలోజు మౌనిక, మీర్‌ అక్బర్,  రమేష్‌ పాల్గొన్నారు. 
బీజేపీలో చేరికలు :
టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చేరినవారిలో మిడ్తనపల్లి మాజీ సర్పంచ్‌ ఎం.గంగయ్య, కందగట్ల నుంచి మద్ది నర్సింహారెడ్డి, బొద్డు మల్సూర్, పాతకోట్ల రమేష్, రవీందర్, వెంకన్న ఉన్నారు. ఈ కార్యక్రమంలో సంకినేని వరుణ్, జాటోతు రాజేష్‌నాయక్, అస్లం, తప్పెట్ల శ్రీరాములు, ఏడుకొండలు ఉన్నారు.

సూర్యాపేటరూరల్‌ : మండలంలోని కుసుమవారిగూడెంలో టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు నాయకులు సోమవారం రాత్రి సంకినేని  సమక్షంలో బీజేపీలో చేరారు. చేరిన వారిలో వెన్న శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, గోగుల నర్సయ్య, సైదులు, రాంబాబు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్,జుట్టుకొండ సత్యనారాయణ, కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, నల్లకుంట్ల అయోధ్య, శైలేంద్రాచారి, సైదులు,  రామకృష్ణ, నరేష్‌గౌడ్, వెన్న శశిధర్‌రెడ్డి, అబీద్, శ్రీనివాస్‌రెడ్డి, శివ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement