బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు.
ఆదిలాబాద్‌లో బీడీ కార్మికుల ఆందోళన
Feb 22 2016 2:17 PM | Updated on Aug 17 2018 2:53 PM
ఆదిలాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న దాదాపు 100 మంది కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని, పుర్రె గుర్తును చిన్నదిగా ముద్రించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, అధికారులకు వినతిప్రతం అందజేశారు.
Advertisement


