'నన్ను ఒక నియంతగా చూశారు' | Bajireddy Govardhan comments on telangana university | Sakshi
Sakshi News home page

'నన్ను ఒక నియంతగా చూశారు'

Jul 3 2014 10:00 AM | Updated on Jul 7 2018 2:56 PM

'నన్ను ఒక నియంతగా చూశారు' - Sakshi

'నన్ను ఒక నియంతగా చూశారు'

పోలీస్ పటేల్గా, గ్రామ సర్పంచుగా పని చేసిన కాలంలో కొందరు తనను ఒక నియంతగా చూశారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు.

నిజామాబాద్ : పోలీస్ పటేల్గా, గ్రామ సర్పంచుగా పని చేసిన కాలంలో కొందరు తనను ఒక నియంతగా చూశారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది అయితే, వర్సిటీ తెచ్చిన ఘనత తనదేనని గర్వంగా చెప్పగలనని ఆయన తెలిపారు. 

 

తెలంగాణ యూనివర్సిటీని ఎక్కడో రాళ్లు, కొండ గుట్టల మధ్య ఏర్పాటు చేయడానికి జిల్లా నాయకుడు ఒకరు ప్రయత్నించారని ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాజిరెడ్డి విమర్శించారు. తాను ఎక్కువగా చదువుకోకున్నా, సమాజాన్ని బాగా చదివానని బాజిరెడ్డి అన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేసేందుకు ముందు ఉంటాయని ఆయన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement