సంగారెడ్డిలో అపహరణ: ఎల్లారెడ్డిలో ప్రత్యక్షం

Baby Kidnap In Nizamabad Government Hospital - Sakshi

ఎల్లారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం నుంచి అపహరణకు గురైన ఓ పాప ఎల్లారెడ్డి మండలంలోని శివానగర్‌లో ప్రత్య క్షమైంది. అపహరణకు గురైన పాప ఆచూకీ లభించడంతో చిన్నారి తల్లితండ్రులు ఆనందంలో ము నిగారు. సంగారెడ్డి జిల్లా కల్పగూర్‌కు చెందిన హన్మోజిగారి మల్లేశం తన భార్య మాధవిని ప్రస వం నిమిత్తం గత నెల 30న సంగారెడ్డిలోని మా తాశిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. సాధారణ ప్రసవంలో మాధవి పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఇంటికి వెళ్లిన రెండు రోజులకు పాపకు కామెర్లు కావడంతో తిరిగి సంగారెడ్డి ఆరోగ్య కేంద్రానికి రాగా వైద్యులు పాపను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈనెల 7న ఆస్పత్రిలో కాంట్రాక్టు ఆయాగా పని చేస్తున్న వనిత కామెర్ల వ్యాధితో చికిత్స పొందిన శిశువును వారి తల్లిదండ్రులకు అప్పగించకుండా ఇతరులకు అప్పగించింది.

తమ శిశువును ఎత్తుకు పోయారన్న విషయాన్ని తెలుసుకున్న మాధవి, మల్లేషం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు ది గారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి వచ్చి శిశువు ను వెతికి అప్పగిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాలకు పంపిచారు. చిన్నారి ఎల్లారెడ్డి మండలం శివానగర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందం గురువారం ఎల్లారెడ్డికి వచ్చి స్థానిక పోలీసుల సహకారంతో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. పాపను హరించిన బంగారు సంతోష్, శోభ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ఇద్దరు శిశువుల మృతితో అపహరణ.. 
శివానగర్‌కు చెందిన బంగారు సంతోష్, శోభా దంపతులు తమ కూతురు కరుణను తన బావ కుమారుడు రవికి ఇచ్చి మేనరిక వివాహం చేశా రు. వారు గతేడాది మగబిడ్డకు జన్మనివ్వగా అత డు అనారోగ్యంతో మృతి చెందాడు. మళ్లీ 15 రో జుల క్రితం ఆడపిల్ల జన్మించగా అనారోగ్యానికి గురై నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందింది. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచని సంతోష్‌ పాప మృతి చెందితే తన కూతురు తట్టుకోలేదని సంగారెడ్డిలోని ఆరోగ్య కేంద్రం నుంచి పాపను అపహరించారు. సదరు పాప ఆచూకీని కనుగొన్న పోలీసులు పాపను స్వాధీనం చేసుకుని నిందితులను సంగారెడ్డికి తీసుకుని వెళ్ళారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top