గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య | An unknown person murdered on tuesday | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

Mar 25 2015 2:33 PM | Updated on Mar 28 2018 11:08 AM

హయత్నగర్ మండలంలోని కోహెడ గ్రామ శివారులో మంగళవారం రాత్రి గుర్తుతెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

రంగారెడ్డి (హయత్‌నగర్): హయత్నగర్ మండలంలోని కోహెడ గ్రామ శివారులో మంగళవారం రాత్రి గుర్తుతెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తాడుతో మెడకు ఉరిబిగించి చంపినట్లు అనుమానిస్తున్నారు. చంపిన తర్వాత చెట్లపొదల్లో మృతదేహాన్ని పడవేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో మద్యం సీసాలు ఉన్నాయి. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులుకి సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement