
పోలీసుల చర్యపై విమర్శలు
నారాయణపేట జిల్లా కోస్గిలో ఘటన
నారాయణపేట జిల్లా: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు తోపుడు బండిపై పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలంతా చూ స్తుండగానే పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఈ ఘటన జరిగింది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మొగులయ్య (28) భార్యాపిల్లలతో కలసి కోస్గి లోని అత్తగారింట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఆదివారం అతను ద్విచక్రవాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్క డే మృతిచెందాడు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తోపుడు బండిలో తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు వచి్చన ఓ చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని అతని అను మ తి లేకుండానే తీసుకొని పోలీసులు మృతదేహాన్ని తరలించిన తీరును చూ సి అక్కడ గుమిగూడిన జనం అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడి యో తీసి ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో ఇదీ పరిస్థితి.. అంటూ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ బాలరాజును వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని చెప్పారు. ఎస్‌హెచ్‌ఓగా ఉన్న ఏఎస్‌ఐ ఆంజనేయులును వివరణ కోరగా మృతుని కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో తోపుడు బండిపై మృతదేహం తరలించామన్నారు. సమయానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఇలా చేయాల్సి వచి్చందని చెప్పారు.