మహబూబాబాదు జిల్లా: మండలంలోని లక్ష్మీపురం గ్రామం 2018 ఆగస్టు 2న నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గతంలో ఈ గ్రామం రేపోణి పంచాయతీ పరిధిలో ఉండేది. అతిచిన్న గ్రామ పంచాయతీ కావడంతో 164 ఓట్లు ఉండేవి. ప్రస్తుతం 213 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 107 కాగా, మహిళలు 106 ఓట్లు. ఈ ప్రాతిపదికన గ్రామంలో ఆరు వార్డులుగా విభజించారు. ఇందులో 18 ఓట్లు వస్తే వార్డు సభ్యులుగా, 107 ఓట్లు వస్తే సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించినట్లే. నూతనంగా ఏర్పడిన జీపీకి కార్యాలయం నిర్మించి అభివృద్ధికి తోడ్ప డాలని మాజీ సర్పంచ్ నల్ల తారమ్మ కోరారు.


