వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకుల సర్పంచ్‌లుగా డోలె రాధ–చిన్ని దంపతులు రికార్డు సృష్టించారు. వారిద్దరే సుమారు 21 సంవత్సరాల పాటు గ్రామాన్ని పాలించడం విశేషం. కొనాయమాకుల గతంలో గీసుకొండ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.1995లో జరిగిన ఎన్నికల్లో తొలి సర్పంచ్‌గా డోలె రాధ ఎన్నికయ్యారు. మళ్లీ 2001లో మరోసారి సర్పంచ్‌గా గెలుపొంది 2006 వరకు పాలన సాగించారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో డోలె రాధ భర్త చిన్ని, డోలె రాజేశ్వర్‌రావుతో పోటీ పడి ఓడిపోయాడు. 2006 నుంచి 2011 వరకు ఐదేళ్ల పాటు రాజేశ్వర్‌రావు సర్పంచ్‌గా కొనసాగారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో చిన్ని మరో మారు రాజేశ్వర్‌రావుతో పోటీ పడి సర్పంచ్‌గా గెలుపొంది 2018 వరకు పదవిలో కొనసాగారు. తర్వాత ఆయన భార్య రాధకు పోటీ చేసే అవకాశం దక్కడంతో ఆమె గెలుపొంది 2019–2024 వరకు సర్పంచ్‌గా కొనసాగారు. ఈ సారి సర్పంచ్ పదవి జనరల్ (అన్ రిజర్వ్‌డ్) కు కేటాయించడంతో చిన్ని మరోమారు సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెబుతున్నాడు. ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.


