నాగార్జునసాగర్ వద్ద ఎయిర్స్ట్రిప్ | air strip to come near nagarjuna sagar | Sakshi
Sakshi News home page

నాగార్జునసాగర్ వద్ద ఎయిర్స్ట్రిప్

Aug 13 2014 7:32 PM | Updated on Oct 19 2018 7:19 PM

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ఎయిర్స్ట్రిప్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ఎయిర్స్ట్రిప్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్‌లో రూ.1600 కోట్లతో డీఆర్డీఓ విభాగం ఏర్పాటు కానుంది. దేశ రక్షణ అవసరాల కోసం నెలకొల్పబోయే యూనిట్‌కు నాగార్జునసాగర్‌ను ఎంపిక చేశారు.

దీనికి ఆ ప్రాంతంలో వంద ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం రక్షణ శాఖకు అనుమతులు మంజూరుచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రక్షణశాఖతోపాటు పర్యాటక అవసరాలకు అనుగుణంగా నాగార్జునసాగర్‌ వద్ద ఎయిర్‌స్ట్రిప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement