'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు' | ACB reveals that revanth always talks with a financier | Sakshi
Sakshi News home page

'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు'

Jun 26 2015 11:14 AM | Updated on Aug 29 2018 7:31 PM

'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు' - Sakshi

'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు'

ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి. రేవంత్ తరచుగా అమీర్పేటకు చెందిన ఓ ఫైనాన్షియర్ తో  ఫోన్లో మాట్లాడేవారని ఏసీబీ వెల్లడించింది. తమ వద్ద ఉన్న కాల్ లిస్టు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఈ విషయాన్ని ధృవీకరించింది. కాగా, ఆ ఫైనాన్షియర్ కృష్ణా జిల్లాకు చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు.

ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా రేవంత్ కు సన్నిహితుడైన ఆ ఫైనాన్షియర్ ను ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనేందుకు రేవంత్ కు నగదు ఏమైనా ఇచ్చాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement