ఏసీబీ అధికారులు వేధిస్తున్నారు

ACB officials are being harassed - Sakshi

     హైకోర్టులో పురుషోత్తంరెడ్డి అల్లుడు పిటిషన్‌ 

     పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి 

     ఏసీబీకి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: దర్యాప్తు పేరుతో ఏసీబీ అధికారులు తనను, తన కుటుంబ సభ్యుల ను వేధించడంతో పాటు బెదిరిస్తున్నారని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌ పురుషోత్తంరెడ్డి అల్లుడు గడ్డం నిపుణ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. న్యాయవాది సమక్షంలో దర్యాప్తు చేయడంతో పాటు మొత్తం ప్రక్రియను వీడి యో రికార్డింగ్‌ చేసేలా ఏసీబీ అధికారులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ నెల 4న ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌రెడ్డి, సతీశ్‌ కుమార్‌లు పిటిషనర్‌ ఇంటికి వచ్చి పురుషోత్తంరెడ్డి ఆచూకీ చెప్పాలంటూ వేధింపులకు పాల్పడ్డారన్నా రు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి  పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.  

ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌... 
ముందస్తు బెయిల్‌ కోసం అజ్ఞాతంలో ఉన్న పురుషోత్తంరెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజని విచారణ జరపనున్నారు. పురుషోత్తంరెడ్డి బావమరిది శ్రీనివాస్‌రెడ్డి కూడా ఏసీబీ అధికారుల వేధిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వాదనలను ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు తోసిపుచ్చారు. పురుషోత్తంరెడ్డికి శ్రీనివాసరెడ్డి బినామీగా వ్యవహరించారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top