లంచం తీసుకుంటూ ఒక అవినీతి ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఉంగూరు : లంచం తీసుకుంటూ ఒక అవినీతి ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన గురువారం మహబూబ్ నగర్ జిల్లా ఉంగూరు పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఉప్పునూతల మండలం కాంసాని గ్రామానికి చెందిన నాటుసారా విక్రయించే వ్యక్తిని ఎస్సై సీహెచ్. రాజు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు.. రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై రాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.