తల్లిదండ్రులు మందలించారని.. | 8th class girl student commits suicide | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు మందలించారని..

Feb 5 2016 6:30 PM | Updated on Nov 6 2018 7:56 PM

తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది.

మాదాపూర్ (హైదరాబాద్) : తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. మాదాపూర్‌లోని కావూరిహిల్స్ ప్లాట్‌నెం 101 లో కుటుంబ సభ్యులతో నివాసముంటున్న హన్సిప్రియ(13) 8వ తరగతి చదువుతోంది.

అయితే ఇంటి పక్కనే ఉన్న వాచ్‌మెన్‌తో తరచూ మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు మాట్లాడవద్దని ఆమెను మందలించారు. దీంతో ఈనెల 3 వ తేదీన సాయంత్రం 7గంటల ప్రాంతంలో చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 4వ తేదీ రాత్రి మృతిచెందింది. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement