ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం | 65 years old man timmappa raped 6 years girl | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం

May 16 2015 6:36 PM | Updated on Oct 4 2018 8:38 PM

మైనర్ బాలికపై ఆత్యాచారం ఘటన మద్దూరు మండలంలో శనివారం కలకలం రేపింది.

మహబూబ్‌నగర్:అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్దుడు శనివారం మధ్యాహ్నం అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పరిసర వాసులు గమనించి అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాలాల మండలానికి చెందిన యాచకుడు తిమ్మప్ప (60) శనివారం ఉదయం మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లికి వచ్చాడు. గ్రామపంచాయతీ సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని బలవంతంగా పక్కలో ఉన్న మరుగుదొడ్డి సందులోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేయబోయాడు. ఇది గమనించిన పరిసర వాసులు అతన్ని పట్టుకొని దేహశుద్ది చేశారు. కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి అక్కడకు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం నారాయణపేటకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement