వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఐదుగురు మృతి | 5 killed in different road accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఐదుగురు మృతి

Jun 5 2014 8:07 AM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ కారు ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


అలాగే నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడగల్ వద్ద లారీ - కారు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో కారులో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందారు. రహదారిపై వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement