సంక్రాంతికి ఆర్టీసీ 3,262 ప్రత్యేక బస్సులు | 3,262 special buses for Pongal | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఆర్టీసీ 3,262 ప్రత్యేక బస్సులు

Jan 4 2018 12:59 AM | Updated on Jan 4 2018 12:59 AM

3,262 special buses for Pongal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సంక్రాంతి సందర్భంగా 3,262 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ నెల 10 నుంచి 13 వ తేదీ వరకు ఈ బస్సులు అందు బాటులో ఉంటాయి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ యాదగిరి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపా రు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపుచార్జీలు వసూ లు చేయనున్నారు. మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల మధ్య 84 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తాయి.

సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్లు, నగరంలో ని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండగా సంక్రాంతి వంటి పర్వదినాల్లో మరో 25 వేల మంది సగటున రోజూ అదనంగా బస్సుల్లో బయలుదేరే అవ కాశముంది. ఇందుకు అనుగుణంగా తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రోజూ నడిచే 3,065 రెగ్యులర్‌ బస్సులతోపాటు 3,262 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ వైపు 1,094 బస్సులు, కర్నూల్‌ వైపు 115, నెల్లూరు 143, వరంగల్‌ 384, కరీంనగర్‌ 280, ఖమ్మం 430, మహబూబ్‌ నగర్‌ 179, ఆదిలాబాద్, నిజామా బాద్‌ జిల్లా లకు 259, నల్లగొండ 228, మెదక్‌ 125, బెంగ ళూరు 15, చెన్నై 5, పూణే వైపునకు 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీని నియం త్రించేందుకు ప్రత్యేక బస్సులను నగర శివార్ల నుంచి నడి పేందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్, ఎల్బీనగర్, బీహెచ్‌ ఈఎల్, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు. 

సంక్రాంతి స్పెషల్‌ రైళ్లు...
సంక్రాంతి  సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి–విశాఖపట్టణం, కాచిగూడ–విశాఖ, తిరుపతి–కాచిగూడ, హైదరాబాద్‌–విశాఖ, సికింద్రా బాద్‌– దర్బం గా, హైదరాబాద్‌– రెక్సాల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కు మార్‌ తెలిపారు. ఈ మేరకు తిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది. కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్‌ ట్రైన్‌ ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖ చేరుతుంది. 

విశాఖ–తిరుపతి(07479) స్పెషల్‌ ట్రైన్‌ ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. 

హైదరాబాద్‌–విశాఖ(07148/07147) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–దర్భంగా(07007/07008) స్పెషల్‌ ట్రైన్‌ ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌ –రెక్సాల్‌ (07005/07006) స్పెషల్‌ ట్రైన్‌ ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్‌ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్‌ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది.   

Advertisement
 
Advertisement
Advertisement