breaking news
speacial buses
-
సంక్రాంతికి ఆర్టీసీ 3,262 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా 3,262 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ నెల 10 నుంచి 13 వ తేదీ వరకు ఈ బస్సులు అందు బాటులో ఉంటాయి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ యాదగిరి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపా రు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపుచార్జీలు వసూ లు చేయనున్నారు. మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల మధ్య 84 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లు, నగరంలో ని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండగా సంక్రాంతి వంటి పర్వదినాల్లో మరో 25 వేల మంది సగటున రోజూ అదనంగా బస్సుల్లో బయలుదేరే అవ కాశముంది. ఇందుకు అనుగుణంగా తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రోజూ నడిచే 3,065 రెగ్యులర్ బస్సులతోపాటు 3,262 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ వైపు 1,094 బస్సులు, కర్నూల్ వైపు 115, నెల్లూరు 143, వరంగల్ 384, కరీంనగర్ 280, ఖమ్మం 430, మహబూబ్ నగర్ 179, ఆదిలాబాద్, నిజామా బాద్ జిల్లా లకు 259, నల్లగొండ 228, మెదక్ 125, బెంగ ళూరు 15, చెన్నై 5, పూణే వైపునకు 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీని నియం త్రించేందుకు ప్రత్యేక బస్సులను నగర శివార్ల నుంచి నడి పేందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, బీహెచ్ ఈఎల్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు. సంక్రాంతి స్పెషల్ రైళ్లు... సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి–విశాఖపట్టణం, కాచిగూడ–విశాఖ, తిరుపతి–కాచిగూడ, హైదరాబాద్–విశాఖ, సికింద్రా బాద్– దర్బం గా, హైదరాబాద్– రెక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కు మార్ తెలిపారు. ఈ మేరకు తిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది. కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖ చేరుతుంది. విశాఖ–తిరుపతి(07479) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. హైదరాబాద్–విశాఖ(07148/07147) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది. సికింద్రాబాద్–దర్భంగా(07007/07008) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ –రెక్సాల్ (07005/07006) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది. -
ప్రయాణం.. నరకప్రాయం
ఆర్టీసీకి భారీగా ఆదాయం.. సదుపాయూల్లో మాత్రం విఫలం ఖమ్మం : ఏ బస్సు చూసినా పుష్కరబాటలోనే..భద్రాచలం, కాళేశ్వరం, రాజమండ్రి, బాసర, ధర్మపురి.. వంటి పుష్కరఘాట్లకే తప్ప సాధారణ రూట్లలో బస్సులు లేక ఆర్టీసీ ప్రయాణికులు వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. అధిక ఆదాయం మోజులో రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసి పుష్కర స్పెషల్స్‌గా మార్చడంతో సాధారణ ప్రయాణికుల బాధలు వర్ణణాతీతంగా మారారుు. గంటలకొద్దీ బస్ స్టాప్‌లో ఎదురుచూసినా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ప్రయూణికులు వాపోతున్నారు. పుష్కరాలు ఎప్పుడు ముగుస్తాయా..? అని రోజులు లెక్కేసుకుంటున్నారు. ఇటు పలు రైళ్లను కూడా పుష్కర స్పెషల్స్‌గా మార్చడం.. ఉదయం రావాల్సిన రైళ్లు రాత్రికి కూడా రాకపోవడంతో ప్రయాణికుల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నారుు. 500 సర్వీసులు పుష్కరదారిలోనే.. జిల్లాలో ఆరు డిపోలు ఉన్నారుు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం డిపోల పరిధిలో మొత్తం 636 సర్వీసులు నడుస్తున్నారుు. వీటిలో ప్రతి డిపో నుంచి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుస్తారుు. వీటితోపాటు పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసులు మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటారుు. పుష్కరాల సందర్భంగా ఆరు డిపోల పరిధిలోని 360 బస్సులు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, వనపర్తి, ఇతర ప్రాంతాల నుంచి 140 సర్వీసులను తీసుకొని మొత్తం 500 బస్సులను పుష్కర స్పెషల్స్‌గా తిప్పుతున్నారు. జిల్లా బస్సులతో పాటు ఇతర డిపోలు తొర్రూరు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, తిరువూరు డిపోల బస్సులను కూడా కుదించారు. వీటిలోనూ ఎక్కువ సర్వీసులను పుష్కరాలకే నడుపుతున్నారు. వివిధ పనుల నిమిత్తం పల్లె నుంచి పట్టణాలకు వచ్చేవారు, పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు నరకం చవిచూస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరుతో అదనపు చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు రెగ్యులర్ ప్రయూణికుల విషయూన్నే మర్చిపోవడం విమర్శలకు తావిస్తోంది. పెరిగిన ఆదాయంతో ఆర్టీసీలో ఆనందం పెరిగిన ఆదాయంతో ఆర్టీసీ అధికారులు తెగ సంబరపడి పోతున్నారు. గతంలో ఆరు డిపోల పరిధిలో రోజుకు రూ.65 లక్షల ఆదాయం వచ్చేది. పుష్కరాలకు రోజుకు 60 లక్షల అదనపు ఆదాయం లభించింది. దాదాపు 1.25 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ పండగ చేసుకుంటోంది. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం డిపోల పరిధిలోనే రోజుకు ఒక్కో డిపోకు 15 లక్షలకు పైగా అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో ప్రయూణికులు ఇక తమ కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నారు.