ప్రయాణం.. నరకప్రాయం | Income heavily to RTC | Sakshi
Sakshi News home page

ప్రయాణం.. నరకప్రాయం

Jul 24 2015 2:58 AM | Updated on Sep 3 2017 6:02 AM

ప్రయాణం.. నరకప్రాయం

ప్రయాణం.. నరకప్రాయం

ఏ బస్సు చూసినా పుష్కరబాటలోనే..భద్రాచలం, కాళేశ్వరం, రాజమండ్రి, బాసర, ధర్మపురి.. వంటి పుష్కరఘాట్లకే తప్ప

 ఆర్టీసీకి భారీగా ఆదాయం..
 సదుపాయూల్లో మాత్రం విఫలం
 
 ఖమ్మం : ఏ బస్సు చూసినా పుష్కరబాటలోనే..భద్రాచలం, కాళేశ్వరం, రాజమండ్రి, బాసర, ధర్మపురి.. వంటి పుష్కరఘాట్లకే తప్ప సాధారణ రూట్లలో బస్సులు లేక ఆర్టీసీ ప్రయాణికులు వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. అధిక ఆదాయం మోజులో రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసి పుష్కర స్పెషల్స్‌గా మార్చడంతో సాధారణ ప్రయాణికుల బాధలు వర్ణణాతీతంగా మారారుు. గంటలకొద్దీ బస్ స్టాప్‌లో ఎదురుచూసినా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ప్రయూణికులు వాపోతున్నారు. పుష్కరాలు ఎప్పుడు ముగుస్తాయా..? అని రోజులు లెక్కేసుకుంటున్నారు. ఇటు పలు రైళ్లను కూడా పుష్కర స్పెషల్స్‌గా మార్చడం.. ఉదయం రావాల్సిన రైళ్లు రాత్రికి కూడా రాకపోవడంతో ప్రయాణికుల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నారుు.

 500 సర్వీసులు పుష్కరదారిలోనే..
 జిల్లాలో ఆరు డిపోలు ఉన్నారుు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం డిపోల పరిధిలో మొత్తం 636 సర్వీసులు నడుస్తున్నారుు. వీటిలో ప్రతి డిపో నుంచి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుస్తారుు. వీటితోపాటు పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసులు మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటారుు. పుష్కరాల సందర్భంగా ఆరు డిపోల పరిధిలోని 360 బస్సులు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, వనపర్తి, ఇతర ప్రాంతాల నుంచి 140 సర్వీసులను తీసుకొని మొత్తం 500 బస్సులను పుష్కర స్పెషల్స్‌గా తిప్పుతున్నారు.

జిల్లా బస్సులతో పాటు ఇతర డిపోలు తొర్రూరు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, తిరువూరు డిపోల బస్సులను కూడా కుదించారు. వీటిలోనూ ఎక్కువ సర్వీసులను పుష్కరాలకే నడుపుతున్నారు. వివిధ పనుల నిమిత్తం పల్లె నుంచి పట్టణాలకు వచ్చేవారు, పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు నరకం చవిచూస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరుతో అదనపు చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు రెగ్యులర్ ప్రయూణికుల విషయూన్నే మర్చిపోవడం విమర్శలకు తావిస్తోంది.

 పెరిగిన ఆదాయంతో ఆర్టీసీలో ఆనందం
 పెరిగిన ఆదాయంతో ఆర్టీసీ అధికారులు తెగ సంబరపడి పోతున్నారు. గతంలో ఆరు డిపోల పరిధిలో రోజుకు రూ.65 లక్షల ఆదాయం వచ్చేది. పుష్కరాలకు రోజుకు 60 లక్షల అదనపు ఆదాయం లభించింది. దాదాపు 1.25 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ పండగ చేసుకుంటోంది. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం డిపోల పరిధిలోనే రోజుకు ఒక్కో డిపోకు 15 లక్షలకు పైగా అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో ప్రయూణికులు ఇక తమ కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement