breaking news
Regional Manager
-
సంక్రాంతికి ఆర్టీసీ 3,262 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా 3,262 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ నెల 10 నుంచి 13 వ తేదీ వరకు ఈ బస్సులు అందు బాటులో ఉంటాయి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ యాదగిరి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపా రు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపుచార్జీలు వసూ లు చేయనున్నారు. మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల మధ్య 84 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లు, నగరంలో ని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండగా సంక్రాంతి వంటి పర్వదినాల్లో మరో 25 వేల మంది సగటున రోజూ అదనంగా బస్సుల్లో బయలుదేరే అవ కాశముంది. ఇందుకు అనుగుణంగా తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రోజూ నడిచే 3,065 రెగ్యులర్ బస్సులతోపాటు 3,262 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ వైపు 1,094 బస్సులు, కర్నూల్ వైపు 115, నెల్లూరు 143, వరంగల్ 384, కరీంనగర్ 280, ఖమ్మం 430, మహబూబ్ నగర్ 179, ఆదిలాబాద్, నిజామా బాద్ జిల్లా లకు 259, నల్లగొండ 228, మెదక్ 125, బెంగ ళూరు 15, చెన్నై 5, పూణే వైపునకు 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీని నియం త్రించేందుకు ప్రత్యేక బస్సులను నగర శివార్ల నుంచి నడి పేందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, బీహెచ్ ఈఎల్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు. సంక్రాంతి స్పెషల్ రైళ్లు... సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి–విశాఖపట్టణం, కాచిగూడ–విశాఖ, తిరుపతి–కాచిగూడ, హైదరాబాద్–విశాఖ, సికింద్రా బాద్– దర్బం గా, హైదరాబాద్– రెక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కు మార్ తెలిపారు. ఈ మేరకు తిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది. కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖ చేరుతుంది. విశాఖ–తిరుపతి(07479) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. హైదరాబాద్–విశాఖ(07148/07147) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది. సికింద్రాబాద్–దర్భంగా(07007/07008) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ –రెక్సాల్ (07005/07006) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది. -
కర్నూలులో ది విశాఖపట్టణం కో ఆపరేటివ్ బ్యాంకు
– ప్రారంభించిన రిజర్వు బ్యాంకు రీజినల్ డైరక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): ది విశాఖపట్టణం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ఆదివారం కర్నూలు నగరంలోని అలంకార్ ప్లాజాలో రిజర్వు బ్యాంకు ఆప్ ఇండియా హైద్రాబాద్ రీజినల్ డైరక్టర్ ఆర్ఎన్ దాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ది విశాఖపట్టణం కో ఆపరేటివ్ బ్యాంకు ఏర్పాటై 101 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ బ్యాంకుపై రిజర్వు బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి ఉంటుందని తెలిపారు. బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 43వ బ్రాంచిని కర్నూలులో ప్రారంబించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా అన్ని రకాల రుణాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, బ్యాంకు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
వేములలో ఎస్బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేయండి
సాక్షి, కడప : వేముల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా అక్కడి ప్రజలకు లావాదేవీలు నిర్వహించుకునేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం కడపలోని ద్వారకానగర్‌లో ఉన్న ఎస్బీఐ రీజినల్ మేనేజర్ జేఎస్ఎస్ ప్రసాద్‌ను ఎంపీ అవినాష్, వేముల మండలానికి చెందిన ఎంపీటీసీ, సర్పంచులతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వేముల ప్రాంతంలో ముగ్గురాయికి సంబంధించిన వ్యాపార లావాదేవీలతోపాటు ఇతర రైతులకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వారు ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వేములలో కేవలం ఏపీజీబీ బ్యాంకుకు సంబంధించిన బ్రాంచ్ మాత్రమే ఉందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆర్ఎం వెంటనే సర్వే చేయించి అందుకు అనుగుణంగా బ్రాంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వేముల మండల పరిశీలకుడు వేల్పుల రాము, సర్పంచులు, ఎంపీటీసీలు రాఘవేంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, పక్కీరప్ప, బయన్న, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, నారాయణరెడ్డి, పుల్లయ్య, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బస్సును పునరుద్ధరించండి భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లెకు సంబంధించిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆర్టీసీ ఆర్ఎం గోపినాథరెడ్డిని కోరారు. సోమవారం సాయంత్రం ఆర్ఎంతో టెలిఫోన్లో ఎంపీ చర్చించారు. ఇప్పటికే ఆ రూటులో తిరిగే ఆటోలను సైతం తిరగనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకున్నారని.. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సు నడపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆర్ఎంకు వివరించారు. వెంటనే బస్సు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ఎం హామీ ఇచ్చారు. అంగన్వాడీ వర్కర్లను నియమించండి భూమయ్యగారిపల్లెలో అంగన్వాడీ స్కూలు ఉంది. అయితే, అంగన్వాడీ వర్కర్లు లేకపోవడంతో అటు పిల్లలు, ఇటు గర్భవతులకు సమస్య ఎదురవుతోందని, వెంటనే అంగన్వాడీ వర్కర్లతోపాటు ఆయాలను నియమించాలని ఎంపీ వైఎస్ అవినాష్ ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాఘవరావును కోరారు. దీనిపై స్పందించిన పీడీ యుద్ధ ప్రాతిపదికన వర్కర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి ఇన్‌ఛార్జిని నియమించి సమస్య లేకుండా చేస్తామని ఎంపీ వైఎస్ అవినాష్‌కు స్పష్టం చేశారు.