గోదావరిలో పడిపోయిన ఆర్టీసీ బస్సు | 2 killed, 305 hurt as bus falls in godavari river in bhadrachalam | Sakshi
Sakshi News home page

గోదావరిలో పడిపోయిన ఆర్టీసీ బస్సు

May 21 2015 1:13 PM | Updated on Aug 25 2018 5:41 PM

గోదావరిలో పడిపోయిన ఆర్టీసీ బస్సు - Sakshi

గోదావరిలో పడిపోయిన ఆర్టీసీ బస్సు

ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి గోదావరి నదిలో పడిపోయింది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బ్రిడ్జి పై నుంచి నదిలో పడింది.

ఖమ్మం: ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి గోదావరి నదిలో పడిపోయింది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బ్రిడ్జి పై నుంచి నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రాలచం డిపోకు చెందిన (AP 20 3940) ఆర్టీసీ రామబాణం బస్సు ఖమ్మం నుంచి భద్రాచలం వస్తుండగా బ్రిడ్జి పైకి వెళుతున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  

ప్రమాదం జరిగిన సమయంలో ఈ  ఈ బస్సులో 40మంది ప్రయాణికులు  ఉన్నారు.  స్థానికులు వెంటన స్పందించి నదిలో పడిపోయిన వారిని రక్షిస్తున్నారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారు ఇద్దరు మహిళలే. కాగా  డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement