పిడుగుపాటుకి ఇద్దరి మృతి | 2 died with thunderbolt in different incidents | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి ఇద్దరి మృతి

Oct 4 2015 3:56 PM | Updated on Oct 17 2018 6:06 PM

ఆదివారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు.

ఆదివారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం కానుకూరు గ్రామానికి చెందిన ఆదె కమలాకర్ (23) ఆదివారం మధ్యాహ్నం పిడుగు పాటుకు గురై మరణించాడు. మధ్యాహ్నం పొలంనుంచి ఇంటికి వస్తుండగా అతనిపై పిడుగుపడింది. దాంతో కమలాకర్ అక్కడేకక్కడే మృతిచెందాడు.


నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం తేంగల్ గ్రామానికి చెందిన రాణి పిడుగు పాటుకు గురై మృతి చెందింది. మధ్యాహ్నం అత్తాకోడళ్లు.. సాయమ్మ, రాణి పొలంలో పనిచేస్తుండగా.. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వారు సమీపంలోని చెట్టుకిందికి వెళ్లారు.

చెట్టుపై పిడుగు పడటంతో.. రాణి అక్కడికక్కడే మృతి చెందింది. సాయమ్మ తీవ్రంగా గాయపడింది. ఇరుగు పొరుగు రైతులు సాయమ్మను భీంగల్ ఆస్పత్రికి తరలించారు. మరో వైపు నల్లగొండ జిల్లా దేవర కొండ మండలం ఎర్రభాగ్య తాండా వద్ద  పిడుగు పడి 12 మేకలు మృతిచెందాయి.

Advertisement
 
Advertisement
Advertisement