పోలీసులమంటూ వసూళ్లు చేస్తున్న ఇద్దరి అరెస్ట్ | 2 arrested for collecting money from people | Sakshi
Sakshi News home page

పోలీసులమంటూ వసూళ్లు చేస్తున్న ఇద్దరి అరెస్ట్

Sep 23 2015 4:54 PM | Updated on Sep 3 2017 9:51 AM

పోలీసులమని చెప్పుకుంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

చిట్యాల(నల్లగొండ): పోలీసులమని చెప్పుకుంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఆంజనేయులు, రామస్వామి అనే ఇద్దరు వ్యక్తులు లారీ డ్రైవర్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వీరిద్దరు మరో ముగ్గురితో కలిసి బక్రీద్ పండగ సందర్భంగా.. లారీలో తరలుతున్న గొర్రెలు, ఆవులను లక్ష్యంగా చేసుకొని పోలీసులమంటూ చెప్తూ.. వారి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా.. ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement