భద్రాద్రి జిల్లాలో 15 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు.
15 మంది రైతులకు అస‍్వస‍్థత
Aug 17 2017 1:44 PM | Updated on Sep 12 2017 12:20 AM
ఖమ‍్మం: భద్రాద్రి జిల్లాలో 15 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు. బూర్గంపాడు మండలం ఉప్పుసాక, టేకుల చెరువు, గోపాలవురం గ్రామాలలో చేలకు, పంటపొలాలకు పురుగు మందులు కొడుతూ 15 మంది రైతులు ఒక్కసారిగా అనారోగ్యానికి పాలయ్యారు. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గమనించిన కుటుంబసభ‍్యులు వారిని వెంటనే ఆస‍్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వారందరూ ఆస‍్పత్రిలో చికిత‍్స పొందుతున్నారు. బాధిత రైతులు రైడన్ అనే పురుగుల మందును టేకుల చెరువులోని ఫర్టిలైజర్ షాప్ లో కొనుగోలు చేశారని తెలుస్తోంది. సమాచారం అందుకున‍్న వ్యవసాయ శాఖ అధికారులు సంబంధింత ఫర్టిలైజర్ దుకాణంలో మందులు పరిశీలిస్తున్నారు.
Advertisement


