ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా | 12 Members Tested positive For Coronavirus From Same Family At Sangareddy District | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా

Jul 19 2020 5:40 AM | Updated on Jul 19 2020 5:40 AM

12 Members Tested positive For Coronavirus From Same Family At Sangareddy District - Sakshi

కాలనీలో హైపోక్లోరైట్‌ ద్రావణం చల్లుతున్న మునిసిపల్‌ సిబ్బంది

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పట్టణంలో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా సోకింది. 14 మంది ఒకే ఇంట్లో ఉండే ఈ కుటుం బం పట్టణంలోని ఆర్‌టీసీ కా లనీలో నివాసం ఉంటోందని అధికారులు చెప్పారు. ఇందు లో తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పాటు వారి పిల్లలందరికీ కలిపి 12 మందికి వైరస్‌ సోకింది. ఆ కుటుంబంలో వీఆర్‌ఓగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తొలుత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు అనుమానంతో మదీనాగుడలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా 12 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. శనివారం మున్సిపల్‌ సిబ్బంది ఆర్టీసీ కాలనీలో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేశారు. ఇదిలా ఉండగా సాయి భగవాన్‌ కాలనీలో ఒకరికి, మారుతీనగర్‌లో మరొకరికి కూడా కరోనా సోకిందని అమీన్‌పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement