breaking news
Twelve people
-
ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణంలో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా సోకింది. 14 మంది ఒకే ఇంట్లో ఉండే ఈ కుటుం బం పట్టణంలోని ఆర్టీసీ కా లనీలో నివాసం ఉంటోందని అధికారులు చెప్పారు. ఇందు లో తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పాటు వారి పిల్లలందరికీ కలిపి 12 మందికి వైరస్ సోకింది. ఆ కుటుంబంలో వీఆర్ఓగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తొలుత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు అనుమానంతో మదీనాగుడలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా 12 మందికి వైరస్ సోకినట్లు తేలింది. శనివారం మున్సిపల్ సిబ్బంది ఆర్టీసీ కాలనీలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. ఇదిలా ఉండగా సాయి భగవాన్ కాలనీలో ఒకరికి, మారుతీనగర్‌లో మరొకరికి కూడా కరోనా సోకిందని అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. -
వడదెబ్బతో పన్నెండు మంది మృతి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో మండుతున్న ఎండలతో వడదెబ్బ తగిలి మంగళవారం పన్నెండు మంది బల య్యారు. మృతుల్లో మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన మన్నె సాయిలు(65), కౌడిపల్లి మండ లం కూకుట్లపల్లికి చెందిన వడ్లరాజు(26), రామాయంపేట పట్టణానికి చెందిన సింధుమోచ మల్లయ్య(60), నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం గిర్నితండాకు చెందిన ఉపాధికూలీ కడావత్ బన్సీ (53), రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని రామన్నగూడ గ్రామానికి చెంది న రైతు తుప్పరి నర్సింహారెడ్డి(68), తాండూరు మండలం కొత్లాపూర్‌లో కర్ణాటకకు చెందిన మసప్ప (60) ఉన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి మండ లం బండసోమారం గ్రామానికి చెందిన కూనూరు రేణుక (26), ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన మల్లేష్ (22) మృతిచెం దారు. ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన దుర్గం మురళీధర్ (47) మర ణించాడు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెం దిన తడికమళ్ల మరియమ్మ (60), కామేపల్లి మండల కేంద్రానికి చెందిన మేదర సౌజన్య(18), చర్ల మండల పరిధిలోని ఆర్ కొత్తగూడేనికి చెందిన కోండ్రు నర్సయ్య (70) మంగళవారం వడదెబ్బతో మృతి చెందారు.