రెండు రాష్ట్రాల్లోనూ రూ. 1,500 పింఛన్ ఇవ్వాలి | 1,500 pension should be given for disabilities in two states | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లోనూ రూ. 1,500 పింఛన్ ఇవ్వాలి

Jun 13 2014 6:52 AM | Updated on Sep 2 2017 8:45 AM

ఎన్నికల హామీ మేరకు వికలాంగులందరికీ రూ. 1,500 పింఛన్‌ను ఒకే విడతలో అందజేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అందె రాంబాబు డిమాండ్ చేశారు.

వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీ మేరకు వికలాంగులందరికీ రూ. 1,500 పింఛన్‌ను ఒకే విడతలో అందజేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అందె రాంబాబు డిమాండ్ చేశారు. వికలాంగత్వపు శాతాన్ని బట్టి పింఛన్ జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతుండగా, తెలంగాణలో కేసీఆర్ ఇంకా ఈ విషయంపై ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయకపోవడాన్ని తప్పుబట్టారు.  వికలాంగులు నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement