స్మార్ట్ దిగ్గజం శాంసంగ్ కు భారీ ముప్పు | Samsung is facing bigger threat from Oppo and Vivo than Apple in India | Sakshi
Sakshi News home page

స్మార్ట్ దిగ్గజం శాంసంగ్ కు భారీ ముప్పు

Apr 29 2017 3:40 PM | Updated on Aug 20 2018 2:55 PM

స్మార్ట్ దిగ్గజం శాంసంగ్ కు భారీ ముప్పు - Sakshi

స్మార్ట్ దిగ్గజం శాంసంగ్ కు భారీ ముప్పు

భారత్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కు చెక్ పెట్టేందుకు వివో, ఒప్పోలు పన్నాగం పన్నుతున్నాయి.

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారి ఏదీ అంటే 2015 వరకు ఆపిల్ పేరే చెప్పేవారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో కూడా ఈ కంపెనీ మార్కెట్ షేరు 13.6 శాతంగా ఉండేది. తర్వాతి స్థానంలో చైనా సిస్టర్స్ బ్రాండుగా పేరులో ఉన్న ఒప్పో, వివోలు ఉండేవి. కానీ తర్వాతి ఏడాదిలో సీనంతా మారిపోయింది.

ఒప్పో, వివోలు 16.8 శాతం, 14.8 శాతం మార్కెట్ షేరుతో తొలి రెండు స్థానాలకు రాక, అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండుగా ఉన్న  ఆపిల్ మార్కెట్ షేరు 9.6 శాతానికి పడిపోయింది. చైనాలో ఆపిల్ తమల్ని బీట్ చేయలేదని ఓప్పో, వివో కంపెనీల వ్యవస్థాపకుడు చైనీస్ బిలినియర్ డుయాన్ యాంగ్ పింగ్ ఆ దిగ్గజానికే సవాలు విసిరారు. ప్రస్తుతం ఇదే స్టోరీ భారత్ లోనూ కొనసాగుతోంది. భారత్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కు చెక్ పెట్టేందుకు వివో, ఒప్పోలు పన్నాగం పన్నుతున్నాయి.
 
బీబీకే రూపొందించిన ఈ సిస్టర్స్ బ్రాండుతో పాటు వాటి తోబుట్టువు వన్ ప్లస్ కలిసి భారత్ లో ఈ ఏడాది తొలి క్వార్టర్ లో 25 శాతానికి పైగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేరును దక్కించుకున్నాయి. మార్కెట్ లీడరు శాంసంగ్ కు అతి చేరువలో నిలిచాయి. మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ సైబర్ మీడియా రీసెర్చ్ తాజా గణాంకాల ప్రకారం శాంసంగ్ కు 28 శాతం మార్కెట్ షేరు ఉంది. శాంసంగ్ ను చైనీస్ కంపెనీ కొల్లగొట్టడం ప్రారంభించాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ అనాలిస్టు తరుణ్ పథాక్ తెలిపారు.

ఉత్పత్తుల భారీ పోర్టుఫోలియో, బలమైన పంపిణీ వ్యవస్థ, త్వరగా రిటైల్ ను చేరుకోవడం ఉన్నప్పటికీ, శాంసంగ్ కంపెనీ చైనాకు చెందిన ఈ కంపెనీలకు తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం శాంసంగ్ కంపెనీకి ఆపిల్ నుంచి కాకుండా, చైనీస్ బ్రాండుల నుంచే భారీ ముప్పు ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైండర్ యాంగిల్ కెమెరా, ఫర్ ఫెక్ట్ సెల్ఫీ గ్రూప్ కు ఉపయోగపడుతుందని భావించిన ఒప్పో, ఇటీవల తన ఫోన్లన్నీ సెల్ఫీ ఫోకస్డ్ గా తీసుకొస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement