పేటీఎమ్ మొబైల్‌ ఇన్సూరెన్స్‌ | paytm offers insurance for paytm users, | Sakshi
Sakshi News home page

పేటీఎమ్ మొబైల్‌ ఇన్సూరెన్స్‌

Mar 24 2017 12:11 PM | Updated on Sep 5 2017 6:59 AM

పేటీఎమ్ మొబైల్‌ ఇన్సూరెన్స్‌

పేటీఎమ్ మొబైల్‌ ఇన్సూరెన్స్‌

మనం ఎంతో ఇస్టపడి, వేలకు వేల రూపాయలు పోసిన కొన్న ఫోన్‌ పోతే మనం ఎంతో ఫీల్‌ అవుతాం.

ముంబై: మనం ఎంతో ఇస్టపడి, వేలకు వేల రూపాయలు పోసిన కొన్న ఫోన్‌ పోతే మనం ఎంతో ఫీల్‌ అవుతాం.. ఫోన్‌ కు ఇన్సూరెన్స్ చేసుకొని ఉంటే బాగుండేది అని బాధపడతాం. కానీ ఇప్పుడు మీ ఫోన్‌ పోయినా, దానికి ఇప్పుడు ఆ దిగులు అవసరం లేదు. మీ ఫోన్‌లో పేటీఎమ్‌ ఉంటే చాలు. మీ ఫోన్‌కు ఇన్సూరెన్స్‌ వస్తుంది. ఇందుకు చేయాల్సిందల్లా ఒకటే, మీ పోన్‌లో పేటీఎమ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొంటే చాలు. పేటీఎమ్‌ వాలెట్‌  యాప్‌ ఉన్న పోన్‌ పోతే, పేటీఎమ్‌ అకౌంట్లో ఉన్న డబ్బుతో పాటు, మీఫోన్‌కు పేటీఎమ్‌ ఇన్సూరెన్స్‌ ఇస్తోంది. ఇది గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది.  పేటీఎమ్‌వాడుతున్న వినియోగదారులు అందరూ ఈ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు.

ఎలా వస్తుందంటే..?: పేటీఎమ్‌ వాలెట్‌ ఉన్న ఫోన్‌, పేటీఎమ్‌ అకౌంట్లో ఉన్న డబ్బు పోయిన 24గంటల్లో పేటీఎం కష్టమర్‌ కేర్‌ నంబర్‌కు(+91 9643979797) ఫోన్‌ చేసి కంప్లెయింట్‌  చేయాలి. ఫోన్‌ పోతే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాల్సి ఉంటుంది. అనంతరం పేటీఎమ్‌ అన్ని వివరాలు పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత 5రోజుల్లో మీ పేటీఎమ్‌ అకౌంట్‌కు మీ డబ్బు జత చేయబడుతుంది. ఈ 5రోజులు మీ పేటీఎమ్‌ అకౌంట్‌ బ్లాక్‌ చేస్తారు. 5 రోజుల తర్వాత కొత్త పాస్‌వర్డ్‌ మీ నెంబర్‌కు మెస్సేజ్‌ వస్తుంది. దానితో మీ పాత పేటీఎమ్‌ అకౌంట్‌లోకి లాగిన్‌అవ్వొచ్చు. అయితే ఇన్సూరెన్స్‌ కింద వినియోగదారునికి రూ.20వేలు మాత్రమే అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement