మోటో ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్

మోటో ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ - Sakshi

మోటో ఫ్యాన్స్ కోసం ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను తీసుకొచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.22,400 వరకు ధర తగ్గింపును అందిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోన్ 12,999 రూపాయలకే అందుబాటులో ఉంది. 32జీబీ, 64జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధరలు రూ.12,999గా, రూ.15,599గా ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పై ఉన్నాయి. అంతేకాక ఈ ఫోన్లపై  ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. 32జీబీ వేరియంట్ పై 12వేల రూపాయలు, 64జీబీ వేరియంట్ పై 14,500 రూపాయల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ అందించే డిస్కౌంట్లతో పాటు ఎక్స్చేంజ్ లో మోటో ఎక్స్ ఫోర్స్ ను కొనాలనుకునేవారికి ఈ ఫోన్ అత్యంత తక్కువగా 999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. 

 

అదనంగా ఈ రెండు వేరియంట్లపై యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు 5 శాతం తగ్గింపు కూడా ఫ్లిప్ కార్ట్ ఇస్తోంది. గతేడాది లాంచ్ చేసినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ 32జీబీ వేరియంట్ ధర 49,999 రూపాయలుండగా.. 64జీబీ వేరియంట్ ధర రూ.53,999గా ఉంది. తర్వాత ఈ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ పై 34,999గా, రూ.37,999కు అందుబాటులో ఉంటూ వస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై ఫ్లాట్ రూ.22వేలు, రూ. 22,400 డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్ ను ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పైనే ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి... ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్, 5.4 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ఆక్టా-కోర్ ఎస్ఓసీ, 2గిగాహెడ్జ్, 3జీబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరణ, 3760ఎంఏహెచ్ బ్యాటరీ, 21ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.  
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top