బాబ్బాబూ..  బాగా చదవండ్రా!

 teaching students to sit on the knees before the students - Sakshi

మోకాళ్లపై కూర్చొని విద్యార్థులను ప్రాధేయపడుతున్న ఉపాధ్యాయులు

టీ.నగర్‌: క్రమశిక్షణ, మార్కుల పేరుతో ఉపాధ్యాయులు విద్యార్థులను చితకబాదిన సంఘటనలు చూశాం. కానీ ఇందుకు విరుద్ధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థుల ముందు మోకాళ్లపై కూర్చుని విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. వివరాలు.. తమిళనాడు  విల్లుపురంలో కామరాజర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో చదివిన అనేకమంది ప్రభుత్వ అధికారులుగా, రాజకీయవేత్తలుగా ఎదిగారు. ఇటీవల విద్యార్థుల్లో క్రమశిక్షణ, విద్యపై ఆసక్తి తగ్గుతున్నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం గుర్తించారు.

దీన్ని అధిగమించి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు కొన్ని విధానాలను రూపొందించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ముందు మోకాళ్లపై కూర్చొని ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం 12వ తరగతికి చెందిన ఓ విద్యార్థి ముందు హెచ్‌ఎం మోకాళ్లపై కూర్చొని క్రమశిక్షణతో మెలగాలని, బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలని ప్రాధేయపడ్డారు. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top