పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.. దేహశుద్ధి 

Teacher Having Sex In School In Tamilnadu Beaten - Sakshi

సాక్షి, చెన్నై: పాఠశాల మరుగుదొడ్డిలో మహిళతో రాసలీలలు చేస్తున్న ఉపాధ్యాయుడిని గ్రామస్తులు మంగళవారం చితకబాది దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా పుదుచత్రం సమీపంలోని ఎస్‌ ఉడుంబం అనే గ్రామం ఉంది. ఇక్కడ ఎలిమింటరీ పాఠశాలకు హెడ్‌మాస్టర్‌గా జయరాజ్, ఉపాధ్యాయుడు శరవణన్‌ ఉ న్నారు. ఇక్కడికి పక్కనే ఉన్న అంగన్‌వాడి పాఠశాలలో పనిచేస్తున్న మహిళకు శరవణన్‌కు అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. వీరు గత కొన్ని నెలలుగా పాఠశాల మరుగుదొడ్డిలో కలుసుకుని రాసలీలలు నెరపుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పినట్టు సమాచారం.

ఈ స్థితిలో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు వచ్చారు. తర్వాత వారు ఉపాధ్యాయుడు శరవణన్‌ను పట్టుకుని పాఠశాలలో మహిళతో ఉన్న విషయంగా నిలదీశారు. తర్వాత మహిళలు చెప్పులు, చీపురలతో శరవణన్‌ను చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ విషయంగా పాఠశాల హెడ్‌మాస్టర్‌ జయరాజ్‌ మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం ఇదే విధంగా శరవణన్‌ ఒక మహిళతో పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్నట్టు తనకు సమాచారం అందిందన్నారు.  అయితే తాను అక్కడికి వెళ్లే సరికి మరుగుదొడ్డికి తాళాలు వేసి ఉన్నాయని, అయినప్పటికీ తాము ఆ తాళాలు తీసి లోపలికి వెళ్లి చూడగా మహిళ ఉన్నట్టు తాము చూశామన్నారు. అయితే అప్పుడు శరవణన్‌ను తాము హెచ్చరించి పంపించేశామని, తర్వాత అప్పటి నుంచి ఎలాంటి అకృత్యాలు పాఠశాలలో జరగలేదని తెలిపారు. పోలీసులు శరవణన్‌ వద్ద  విచారణ జరుపుతున్నారు. .

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top