తమిళనాడులో బీజేపీకి బానిసలా ఆ పార్టీ !

Tamilnadu Muslim League Party Protesting Triple Talaq Law - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాట బీజేపీకి అన్నాడీఎంకే పార్టీ బానిసలా కొనసాగుతుందని తమిళనాడు ముస్లిం లీగ్‌ పార్టీ అధ్యక్షడు ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై ముస్లింలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే తమిళనాడు ప్రభుత్వం మాత్రం బీజేపీకి బాజా వాయిస్తుందని మండిపడ్డారు. గురువారం ట్రిప్లికేన్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ట్రిపుల్‌ తలాక్‌ చట్టానికి వ్యతిరేకంగా వందలాది ముస్లిం మహిళలు మోదీకి బ్లాక్‌ పోస్ట్‌ కార్డులను పంపే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలతో పాటు మహిళలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ మతాచారాలపై బీజేపీవి కక్ష సాధింపు చర్యలు తేటతెల్లమైందన్నారు. ఏళ్ల తరబడి ఖురాన్‌ను పాటిస్తుంటే దానికి వ్యతిరేకంగా హిందుత్వ కుట్రతో బీజేపీ తమ జాతిని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందనీ, దానికి తమిళ ప్రభుత్వం వంత పాడడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top