‘పాకిస్తాన్‌ వెళ్లిపోండి!’

Go to Pakistan says India officer as leader praises crackdown - Sakshi

మీరట్‌: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను ‘పాకిస్తాన్‌ వెళ్లిపోండి’ అని మీరట్‌లోని ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. సీఏఏకి వ్యతిరేకంగా మీరట్‌లో డిసెంబర్‌ 20న లిసారీ గేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో ఆందోళనకారులను ఉద్దేశించి మీరట్‌ ఎస్పీ అఖిలేష్‌ నారాయణ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అయ్యింది. ‘నిరసన సందర్భంగా పాక్‌కు మద్దతుగా కొందరు నినాదాలు చేస్తున్నారు. భారత్‌లో ఉండి పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేసే వారు ఆ దేశానికే వెళ్లిపోండి’అని తాను వారికి సలహా ఇచ్చానని సింగ్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం తీవ్రంగా తప్పుబడ్డారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top