ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైఎస్ జగన్ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు వైఎస్ఆర్ సీపీ నాయకుడు శంకర్నారాయణ పిలుపు నిచ్చారు.
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైఎస్ జగన్ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు అనంతరపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్నారాయణ పిలుపు నిచ్చారు. అక్టోబర్ 4వ తేదీన అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలసి వైఎస్ జగన్ మహాధర్నా నిర్వహించనున్నారు. రైతు సమస్యలపై టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పోరు బాట చేపట్టిన సంగతి తెలిసిందే.