తల్లిదండ్రులు మందలించారని.. | young women commits suicide in west godavari district | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు మందలించారని..

Nov 25 2016 4:24 PM | Updated on Aug 1 2018 2:20 PM

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం గంగన్నగూడెంలో విషాదం చోటు చేసుకుంది.

జీలుగుమిల్లి: పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం గంగన్నగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఓ విషయంలో తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో మంజుల(16) అనే యువతి పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న జంగారెడ్డి గూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందింది. స్థానికంగా ఉన్న త్రివేణి కళాశాలలో మంజుల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement