బీజేపీ అభ్యర్థులను గెలిపించండి | work towards the success of BJP candidates | Sakshi
Sakshi News home page

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి

Aug 10 2015 2:12 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి - Sakshi

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి

బీబీఎంపీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తెలబడే అవకాశం ఉందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన ....

కేంద్ర మంత్రి సదానంద గౌడ
 
కృ్ణరాజపురం : బీబీఎంపీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తెలబడే అవకాశం ఉందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందకుండా బీజేపీ అభ్యర్థుల విజయానికి కృష చేయాలని ఆ పార్టీ కార్యకర్తలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందాగౌడ పిలుపునిచ్చారు. కృష్ణరాజపురంలోని పై లేఔట్‌లో ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణరాజపురం పరిధిలోని బీబీఎంపీ వార్డుల్లో  పార్టీ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు. అభివృ్ధని కాంక్షించేవారు బీజేపీకి ఓటు వేయాలని కోరారు.

మైసూరు నగరాన్ని అభివృ్ధ చేయడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కనబరుస్తున్న శ్రద్ధ బెంగళూరుపై చూపడం లేదని అన్నారు. బెంగళూరు నగరం అభివృ్ధ కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు.  పార్టీ తరుఫున ఎన్నికల బరిలో నిలిచిన వారిలో హొరమావు వార్డు నుంచి భారతీ మునిరాజు, రామ్మూర్తి నగర నుంచి పద్మావతి శ్రీనివాస్, విజినాపుర నుంచి ఎస్.రాజు, కృష్ణరాజపురం నుంచి పూర్ణిమా శ్రీనివాస్, దేవసంద్ర వార్డు నుంచి పుట్టరాజు, బసవనపుర నుంచి సుందర్‌రాజు, హెచ్‌ఎఎల్ నుంచి శశిధర్ రాజన్, విజ్ఞాన నగర్ నుంచి మోహన్‌మూర్తి, ఎ.నారాయణపుర నుంచి వి.సి.రాజు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నందీష్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రమేష్, మాజీ కార్పొరేటర్ గీతావివేకానంద బాబు, మంజుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement