
కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన సంపత్‌కుమారి
మైసూరు: ముందస్తు హెచ్చరికలు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నగరానికి చెందిన మహిళా ఉపాధ్యాయురాలు సంపత్‌కుమారి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒంటరిగా నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ 26 సంవత్సరాలుగా నగరంలోని మహాజన ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నానన్నారు.
ఎటువంటి కారణాలు లేకుండా, ముందస్తు హెచ్చరికలు లేకుండా పాఠశాల యజమాన్యం తనను ఉద్యోగం నుంచి తొలగించిందని కన్నీటి పర్యంతమైంది. కనీసం పరిహారాన్ని కూడా ఇవ్వకుండా యజమాన్యం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని, తనను తిరిగి విధుల్లోకి తీసుకునేలా యాజమాన్యాన్ని ఒప్పించాలని ఆమె డిమాండ్ చేశారు.