ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య | Woman kills husband with lover's help | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

Jun 24 2015 2:29 AM | Updated on Jul 27 2018 2:21 PM

మృతదేహం కోసం తవ్వుతున్న దృశ్యం(ఇన్‌సెట్‌లో) మృతుడు బాలకృష్ణన్(ఫైల్) - Sakshi

మృతదేహం కోసం తవ్వుతున్న దృశ్యం(ఇన్‌సెట్‌లో) మృతుడు బాలకృష్ణన్(ఫైల్)

భర్తను ప్రియుడితో కలసి హతమార్చి, అతడి శరీరాన్ని ముక్కులు ముక్కలుగా కోసి పాతి పెట్టిన ఓ భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సేలం: భర్తను ప్రియుడితో కలసి హతమార్చి, అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పాతి పెట్టిన ఓ భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేలం అమ్మా పాళయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సేలం అమ్మాపాళయంకు చెందిన బాలకృష్ణన్(45) స్థానికంగా సెలూన్ షాపు నడుపుతున్నాడు. ఇతని భార్య సుందరి(35). వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతంలోని రాజేంద్రన్ ఇంట్లో కుటుంబంతో కలసి బాలకృష్ణన్ అద్దెకు ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది సెప్టెంబర్‌లో బాలకృష్ణన్ అదృశ్యం అయ్యాడు.

బాలకృష్ణన్ అదృశ్య మిస్టరీని ఛేదించేందుకు సూర మంగళం పోలీసులు రంగంలోకి దిగారు. సేలం పోలీసు కమిషనర్ అమల్ రాజ్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ మురుగేషన్ విచారణ వేగవంతం చేశారు.
 
భర్తను కడతేర్చి: పోలీసు రహస్య విచారణలో బాలకృష్ణన్ ఇంట్లోకి తరచూ ఇంటి ఓనర్ రాజేంద్రన్ తనయుడు లోకనాథన్(27) వెళ్లి వస్తుండడం వెలుగులోకి వచ్చింది. లోకనాథన్, బాలకృష్ణన్ భార్య  సుందరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. దీంతో మంగళవారం ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టు అయింది. లోకనాథన్, సుందరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం తెలిసి బాలకృష్ణన్ ఇద్దరిని మందలించాడు.

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుండడంతో ఆగ్రహించిన ఆ ఇద్దరు బాలకృష్ణన్‌ను హతమార్చేందుకు పథకం వేశారు. గత ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ ఇంట్లో మద్యం మత్తులో బాలకృష్ణన్ ఉండడాన్ని గుర్తించి పథకం అమలుకు నిర్ణయించారు. తన స్నేహితులు కుమార్ (24), రేవన్(25)తో కలసి ఆ ఇంట్లోకి లోకనాథన్ చొరబడ్డారు. ఈ ముగ్గురు, సుందరి కలిసి కత్తులతో బాలకృష్ణన్‌ను పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయడం కష్టతరం కావడంతో, దానిని ముక్కలు మక్కలుగా కోశారు. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఎవరి దారిన వారు అన్నట్టుగా ఉండి పోయారు.

మరుసటి రోజు ఆ ముక్కల్ని తీసుకెళ్లి ఓ శ్మశానంలో  నాలుగైదు చోట్ల పూడ్చి పెట్టారు. వీరి వివాహేతర గుట్టు, హత్య బండారం బయట పడడంతో ఆ పరిసర వాసులు షాక్‌కు గురి అయ్యారు. ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహం ముక్కలు పాతి పెట్టిన ప్రాంతాల్లో తవ్వకాల్లో పడ్డారు. కేసు నమోదు చేసిన ఆ నలుగుర్ని కటకటాల్లోకి నెట్టారు. తన సుఖం కోసం  వివాహేతర సంబంధం భర్తను కడతేర్చి సుందరి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథగా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement