వివాహిత అనుమానాస్పద మృతి | wife died and husband injured in a accident | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Oct 29 2016 3:05 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గూడూరు: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం రావూరు సమీపంలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త రాంబాబు కథనం ప్రకారం... భార్య వెంకట నాగమణి(23)తో కలిసి ద్విచక్ర వాహనంపై కావలి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పాడు. తామిద్దరం కావలి నుంచి చెరువు మీదుగా బైక్‌పై రావూరు వస్తున్నామని, గుర్తు తెలియని వాహనం తమ బైక్‌ను ఢీకొట్టిందన్నాడు.

ఈ ఘటనలో తనకు గాయాలు కాగా భార్య నాగమణి తీవ్రగాయాలతో మృతిచెందిందని రాంబాబు చెబుతున్నాడు. ఆయన చికిత్స కోసం కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. కాగా, రాంబాబే నాగమణిని చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement