నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు | villagers dharna for water problem | Sakshi
Sakshi News home page

నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

May 16 2017 11:11 AM | Updated on Sep 5 2017 11:18 AM

నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని వేంకటాద్రిపాలెంలో నీటి కోసం ప్రజలు మంగళవారం ఉదయం రోడ్డు ఎక్కి ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్నారు.

నల్లగొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని వేంకటాద్రిపాలెంలో నీటి కోసం ప్రజలు మంగళవారం ఉదయం రోడ్డు ఎక్కి ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన తమ నీటి కష్టాలు తీరలేదని, ,ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ కష్టాలు పట్టించుకోవటం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన వ‍్యక‍్తం చేస‍్తున్నారు. మహిళల ధర్నా వల‍్ల కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించి పోయాయి. పోలీసులు ఎంత నచ్చ జెప్పినా మంచి నీరు మా ఊరికి వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని గ్రామస్తులు రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement