ఇళయదళపతితో ఎమి రొమాన్స్ | Vijay to Romance with Amy Jackson | Sakshi
Sakshi News home page

ఇళయదళపతితో ఎమి రొమాన్స్

Jun 14 2015 3:15 AM | Updated on Sep 3 2017 3:41 AM

ఇళయదళపతితో ఎమి రొమాన్స్

ఇళయదళపతితో ఎమి రొమాన్స్

కోలీవుడ్‌లో నటి ఎమిజాక్సన్ తన గ్రాస్‌ను పెంచుకుంటూ పోతున్నారు. అదే సమయంలో ఒక్కో చిత్రంలో తన స్థాయిని

కోలీవుడ్‌లో నటి ఎమిజాక్సన్ తన గ్రాస్‌ను పెంచుకుంటూ పోతున్నారు. అదే సమయంలో ఒక్కో చిత్రంలో తన స్థాయిని మెరుగుపరచుకుంటున్నారని చెప్పకతప్పదు. కెనడా మోడలింగ్ చేసుకుంటున్న ఎమి దర్శకుడు విజయ్ మదరాసు పట్టణంతో కోలీవుడ్‌కు దిగుమతి చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో ట్రైల్ చూద్దాం అన్న ఆలోచనతో రంగప్రవేశం చేసిన ఈ ఇంగ్లిష్ బ్యూటీ తమిళ ప్రేక్షకులకు తొలి చిత్రంతోనే తెగ నచ్చేశారు. మధ్యలో తాండవం బాగా నర్తించకపోయినా సమంత పుణ్య మా అని స్టార్ దర్శకుడు శంకర్ దృష్టిలో పడ్డారు. అవును ఐ చిత్రంలో విక్ర మ్ సరసన సమంత నటించాల్సింది.
 
 ఆమె స్కిన్ ఎలర్జీ సమస్యతో ఆ చిత్రాన్ని వదులుకోవలసి వచ్చింది. ఐ చిత్రంలో ఎమి వెండి తెరపై ఆరబోసిన అందాలు ప్రేక్షకులను సమ్మోహితున్ని చేశాయనే చెప్పాలి. అంతేకాదు కోలీవుడ్‌లో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఫలితం యువ నటులు ధనుష్‌తో ఒక చిత్రం, ఉదయనిధి స్టాలిన్‌తో ఒక చిత్రం అంటూ వరుసగా సైన్ చేసేశారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌తో గెత్తు చిత్రం కోసం డ్యూయెట్లు పాడుకుంటున్న ఎమిజాక్సన్‌కు మరో బడా ఆఫర్ తలుపుతట్టిందన్నది తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. పులి చిత్రం పూర్తి చేసిన విజయ్ తదుపరి యువ దర్శకుడు అట్లి దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించనున్న భారీ చిత్రంలో ఎమి ఒక హీరోయిన్‌గా నటించనున్నారన్నది సమాచారం. ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా సమంత ఎంపికయ్యారన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement