యువతి కోసం డిష్యూం డిష్యూం 

 two guys fighting on street for a girl friend in karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : అమ్మాయి కోసం ఇద్దరు యువకులు నడిరోడ్డుపై కొట్టుకున్న సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి హలసూరు గేట్‌ సమీపంలోని ధర్మరాయ దేవాలయం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే... హలసూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఇదే విషయమై ఇద్దరి మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో కూడా అమ్మాయి కోసం ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మొన్న రాత్రి హలసూరు గేట్‌ సమీపంలోని ధర్మరాయ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కరగ ఉత్సవం చూడడానికి వెళ్లిన ఇద్దరు యువకులు ఎదురెదురుగా తారసపడ్డారు. దీంతో మరోసారి అమ్మాయి విషయమై ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం శృతి మించడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. హలసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top