పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) విజయవాడ తొలి సంచాలకులుగా తుమ్మ విజయకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
అమరావతి : పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) విజయవాడ తొలి సంచాలకులుగా 1990 ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్(1990 బ్యాచ్)కు చెందిన తుమ్మ విజయకుమార్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఏపీలో పత్రికా సమాచార కార్యాలయాన్ని బలోపేతం చేస్తూ పీఐబీ విజయవాడ కార్యాలయానికి నూతనంగా సంచాలకుల పోస్టును మంజూరు చేయటంతో పాటు టీవీకే రెడ్డిని ప్రభుత్వం నియమించింది. టీవీకే రెడ్డి గతంలో హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారిగా, ఫీల్డ్ పబ్లిసిటీ విభాగం ఏపీ,తెలంగాణ సంచాలకులుగా, పీఐబీ హైదరాబాద్ సంచాలకులుగా పనిచేశారు. ఆయన 25 సంవత్సరాల నుంచి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు.