ఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా ఆందోళన | tundurru villagers protests against mega aqua food park in bhimavaram | Sakshi
Sakshi News home page

ఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా ఆందోళన

Sep 12 2016 12:17 PM | Updated on Sep 4 2017 1:13 PM

పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం మండలం తుందూరులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. 
 
ఈ ఆందోళనలో ఏడు గ్రామాల ప్రజలు పాల్గొని...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫుడ్ పార్క్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు ముందస్తుగా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement