నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు | trisha Sensational comments on Marriage | Sakshi
Sakshi News home page

నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు

Jul 8 2015 2:43 AM | Updated on Sep 3 2017 5:04 AM

నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు

నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు

నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నారు సంచలన తార త్రిష.

 నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నారు సంచలన తార త్రిష. ఈమె పెళ్లి వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో నిశ్చయమై పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్న సమయంలో అనూహ్యంగా పెళ్లి రద్దయిన విషయం తెలిసిందే. ఈ విషయం సినీరంగానంతా కలకలం పుట్టించినా త్రిష, ఆమె కుటుంబం మాత్రం గుంబనంగా ఉండిపోయారు.ఆ తరువాత చాన్నాళ్లకు త్రిష తల్లి మౌనం వీడారు.కొందరు కుటుంబ పెద్దలే వివాహ రద్దుకు కారణం అంటూ ముక్త సరిగా ముగించారు.
 
  అలాంటిది తాజాగా వరుణ్‌మణియన్‌తో తన వివాహ రద్దుకు చాలా మంది కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం గురించి త్రిష ఏమంటున్నారో చూద్దాం వరుణ్‌మణియన్ తో నా పెళ్లి పెద్దలు నిశ్చయించినదే. వారి కోరికతో నేను అంగీకరించాను. అయితే వాటితో పాటే కొన్ని నిబంధనలు విధించారు. అందుకే పెళ్లి రద్దు చేసుకున్నాం. అయితే ఈ రద్దు వెనుక చాలా మంది ఉన్నారు. నాకు వివాహ సంప్రదాయంపై నమ్మకం ఉంది. అలాగే సంస్కృతి, సంప్రదాయాలపైనా గౌరవం ఉంది.
 
 ఇంకా చెప్పాలంటే నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకర్ని ఎంచుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. అని అంటున్న త్రిష ప్రస్తుతం కేరీర్ పరంగా మంచి పీక్‌లో ఉన్నారు. జయంరవి సరసన నటించిన భూలోకం విడుదల కావలసి ఉండగా, ఆయనతో నటించిన మరో చిత్రం అప్పాటక్కర్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కమల్ సరసన తూంగానగరంతో పాటు భోగీ అనే ఒక తెలుగు చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement