రైలు ఎక్కే తొందరలో.... | Train climbing soon .... | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కే తొందరలో....

Dec 17 2014 10:08 PM | Updated on Sep 2 2017 6:20 PM

రైలు ఎక్కే తొందరలో....

రైలు ఎక్కే తొందరలో....

రైలు ఎక్కడానికి వెళుతూ ప్లాట్‌ఫాం, రైలుకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పడి మణికట్టు వరకు చేయి పోగొట్టుకున్నాడు.

సాక్షి, ముంబై: రైలు ఎక్కడానికి వెళుతూ ప్లాట్‌ఫాం, రైలుకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పడి మణికట్టు వరకు చేయి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మంగళవారం  శాంతాక్రజ్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఖార్‌లోని సాయిబాబా నగర్ నివాసి అయిన అరుణ్ సావంత్ (35), శాంతాక్రజ్‌లోని రైల్వే స్టేషన్‌లో పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ కాలు జారి రైలుకి, ప్లాట్‌ఫాంకి ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయాడు. ఈ ఘటనలో మణికట్టు వరకు చేయి తెగిపోయింది. స్పృహ కోల్పోయిన సావంత్‌ను విలేపార్లేలోని కూపర్ ఆసుపత్రికి తరలించామని బాంద్రా గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబానికి సమాచారం అందించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement