నేడు సీఎం ప్రజెంటేషన్ | Today chief minister presentation | Sakshi
Sakshi News home page

నేడు సీఎం ప్రజెంటేషన్

Dec 27 2013 12:20 AM | Updated on Oct 22 2018 9:16 PM

తన ప్రభుత్వ పరిపాలన తీరు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ముంబై: తన ప్రభుత్వ పరిపాలన తీరు గురించి  రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పనితీరును సమీక్షించాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈ ప్రక్రియంతా అని మంత్రాలయ సీనియర్ అధికారి ఒకరు గురువారం తెలిపారు.

ధరల పెరుగుదల, గతేడాది వేసవిలో కరువు సంభవించినప్పుడు తీసుకున్న చర్యలు, విదర్భలో తరచూ వరదలు వచ్చినప్పుడు తీసుకున్న సహాయక చర్యలు గురించి పార్టీ అధిష్టానానికి సీఎం చవాన్ వివరిస్తారని చెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, కొత్తగా తీసుకొచ్చిన లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం ఎలా అమలుచేయనుందన్న విషయాలను కూడా చెబుతారని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement