నిధి కోసం కన్నబిడ్డను హతమార్చిన దుర్మార్గుడు | The murder of a baby than for treasure | Sakshi
Sakshi News home page

నిధి కోసం కన్నబిడ్డను హతమార్చిన దుర్మార్గుడు

Jun 8 2014 2:26 AM | Updated on Aug 21 2018 5:46 PM

నిధి కోసం కన్న బిడ్డను స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన గుల్బర్గా జిల్లా ఫిరోజ్‌బాద్ గ్రామంలో జరిగింది. షాజియా (18 నెలలు) అనే చిన్నారి మొండెం...

  • స్నేహితులతో కలిసి దారుణం
  •  ఆరుగురి అరెస్ట్
  •  గుండెపోటుతో ప్రధాన నిందితుడి మృతి
  •  చిన్నారి మొండెం, తల నరికి హత్య  
  • బెంగళూరు, న్యూస్‌లైన్ : నిధి కోసం కన్న బిడ్డను స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన గుల్బర్గా జిల్లా ఫిరోజ్‌బాద్ గ్రామంలో జరిగింది. షాజియా (18 నెలలు) అనే చిన్నారి మొండెం, తల, చేతులు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుల్బర్గాకు చెందిన ముషాక్ (39)ను పోలీసులు విచారణ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు.

    గత నెల 19న జరిగిన సంఘటన వివరాలు... ఫిరోజ్‌బాద్‌లో నివాసముంటున్న శంషాద్‌కు షాజియా అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే శంషాద్ స్నేహితుడు ముషాక్. గుల్బర్గాకు చెందిన ముషాక్ నిధులు ఉన్నాయంటూ పలువురిని మోసగిస్తూ ఉంటాడు. గతనెల ముషాక్, శంషాద్ ఇంటికి వెళ్లాడు. ఓ చిన్నారిని బలి ఇస్తే రూ. కోట్ల విలువైన నిధి లభిస్తుందని  శంషాద్‌ను నమ్మించాడు. దీంతో శంషాద్ అతని మాయమాటలు విని గతనెల 19న కుమారుడు షాజియాను తీసుకుని స్నేహితులతో కలిసి ఓ నిర్జన ప్రదేశంలోకి వెళ్లి దారుణంగా హత్య చేశారు.

    అదే నెల 21న షాజియా కనపడటం లేదని శంషాద్ సహ కుటుంబ సభ్యులు పరహతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేశారు. అదే నెల 26న గ్రామ సమీపంలో బాలుడి చేతులు, మొడం పోలీసులు గుర్తించారు. కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి షాజియా తండ్రి శంషాద్, ముషాక్ సహ ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

    ముషాక్‌ను విచారణ చేస్తుండగా అతను పోలీసుల ఎదుటే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన గుల్బర్గాలోని బసవేశ్వర ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారని శనివారం పోలీసులు తెలిపారు. నిధుల ఆశతో చిన్నారిని హత్య చేసినట్లు శంషాద్ (బాలుడి తండ్రి)తో సహ ఐదుగురు నేరం అంగీకరించారని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement